మందమర్రి వర్క్‌షాప్ ఏఐటీయూసీ పిట్ కమిటీ రివ్యూ సమావేశం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియా వర్క్‌షాప్ ఏఐటీయూసీ పిట్ కమిటీ రివ్యూ సమావేశం బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్క్‌షాప్‌లోని వివిధ సెక్షన్ల ఇన్‌చార్జీలు తమ సెక్షన్లలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంతవరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ తెలిపారు. సమావేశంలో సుమారు 60 మంది కమిటీ...