అండర్–14, 17 బాల, బాలికల విభాగాల్లో పోటీలు
ఉదయం 9 గంటలకు ప్రారంభం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17 బాల, బాలికల జిల్లా స్థాయి నెట్‌బాల్ ఎంపిక పోటీలు ఈ 20న మందమర్రిలో నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి యాకూబ్, ఆర్గనైజర్ రామ్ వేణు తెలిపారు.

మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలోని హైదరాబాద్ కృష్ణవేణి పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఉదయం 9 గంటలకు నెట్‌బాల్ ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని అర్హత కలిగిన క్రీడాకారులు ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.
పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, జన్మదిన ధ్రువీకరణ పత్రం, పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికెట్, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తమ వెంట తీసుకురావాలని సూచించారు. సంబంధిత ధ్రువపత్రాలతో ఆదివారం ఉదయం 9 గంటలలోపు కృష్ణవేణి పాఠశాల కరస్పాండెంట్, ఆర్గనైజర్ రామ్ వేణుకు రిపోర్టు చేయాలని కోరారు.
జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేసే అవకాశం ఉన్నందున అర్హులైన విద్యార్థులు సమయానికి హాజరై పోటీల్లో పాల్గొనాలని ఎస్జీఎఫ్ నిర్వాహకులు సూచించారు.

