NIGAMA MEDIA (P) LTD
16.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, August 30, 2026

పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సభకు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు భారీగా తరలిరావాలి
టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇంఛార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపు

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆగస్టు 31న సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇంఛార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపునిచ్చారు.

తెలంగాణ హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్న ఈ సభకు ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, సమస్యలు, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలను ఈ సభ వేదికగా ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

పెద్దపల్లి నియోజకవర్గం నుంచి తెలంగాణ ఉద్యమకారులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో నిజామాబాద్‌కు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని సలేంద్ర కొమురయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవిష్యత్తు కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.