NIGAMA MEDIA (P) LTD
13.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, August 29, 2026

రాఖీ పౌర్ణమి వేడుకల్లో ఆత్మీయత

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణకు రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎన్. రాధాకృష్ణకు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయం, గనులు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా ఉద్యోగులు తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. సోదర భావంతో మహిళా ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా జీఎంకు రాఖీ కట్టడం ఆనందంగా ఉందని మహిళా ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం కార్యాలయానికి చెందిన మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.