కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కమాన్ నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆకర్షణీయంగా స్వాగతం పలికేలా కమాన్‌ను నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా శివార్ రామ్‌రెడ్డిపల్లి సర్పంచ్ ధరణి లక్ష్మి శ్రీనివాస్, బీబీపేట్ సర్పంచ్ ఉప్పల సాత్విక సాయినాథ్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొని భూమిపూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా కమాన్ నిర్మాణానికి భూమిపూజ చేయడం పట్ల స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు

