NIGAMA MEDIA (P) LTD
17.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, September 11, 2026

విద్యార్థులకు డ్యూయల్ డెస్క్‌ల బెంచీల పంపిణీ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

కేపీ రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో, కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి తమ సొంత నిధులతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డ్యూయల్ డెస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం బీబీపేట్ మండలంలోని బీబీపేట్ పట్టణం, తుజాల్‌పూర్, శేరి బీబీపేట్ గ్రామాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు డ్యూయల్ డెస్క్‌లు అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి గౌరవంగా కూర్చొని చదివే అవకాశం కల్పించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.