Home » దిగివస్తున్న బంగారం ధర …

దిగివస్తున్న బంగారం ధర …

హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరం
వెండి కూడా యథాతథం

కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్):

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ, ఈరోజు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిన్నటి ధరల వద్దనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,950గా ఉంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,950గా కొనసాగుతోంది.

ఇక వెండి ధరలు కూడా వరుసగా రెండో రోజు స్థిరంగానే ఉన్నాయి. నిన్న బంగారం ధరలు పెరిగినా వెండి ధరల్లో ఎలాంటి మార్పు నమోదు కాలేదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,950
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,950
వెండి (కిలో): రూ.2,45,000

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *