NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 12, 2026

KTR : భాష మారితేనే భవిష్యత్తు….

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

KTR : నోటి మాట జారిన వ్యక్తి…..యుద్ధంలో ఆయుధం జారవిడిచిన వ్యక్తి … ఈ ఇద్దరూ ఒకటే అంటారు పెద్దలు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులకు తిరుగులేదని కళలు కన్నారు. అధికారం కోల్పోయిన తరువాత పలువురు గులాబీ నేతల నోటి మాటకు అదుపు లేకుండా పోయింది. అందులో పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఒకరు అని చెప్పక తప్పదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడితే ఆ మాటలు వింటున్న జనం కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అందుకే కేటీఆర్ మాట్లాడే భాష మారితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు…….

వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బరిలో నిలిచారు. ఆ ఎన్నికల ప్రచారంలో తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ పల్లి బఠాణి కి విట్స్ పిలానీ మధ్య పోటీ నడుస్తోందన్నారు. తీన్మార్ మల్లన్నను పల్లి బఠాణి తో పోల్చారు కేటీఆర్. పెద్దగా చదువుకొని మల్లన్నకు ఓటు వేయడం సరికాదంటూ ఆయన నిర్వహించిన ప్రతి సభలో విమర్శించారు. ఆ విదంగా కేటీఆర్ మాట్లాడిన మాటలను పట్టభద్రులు పెద్దగా పట్టించుకోలేదు. మల్లన్న విజయం సాధించారు.

తాజాగా జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా కేటీఆర్ నోరుజారారు. నవీన్ యాదవ్ ను ఆకు రౌడీ అంటూ సంబోధించారు. ఈ నేపథ్యంలో నవీన్ తండ్రి చిన్న శ్రీ శైలం ఇన్ని రోజులు కడుపులో పెట్టుకున్న విషయాన్ని వెళ్లగక్కారు. కేసీఆర్ కూతురు కవిత వివాహానికి తానే ఆర్థిక సహాయం చేసానని జనంలో స్పష్టం చేశారు. ఈ విషయంలో దమ్ముంటే చర్చకు రావాలని శ్రీ శైలం సవాల్ విసిరారు. ఇది ఇలా ఉండగా నవీన్ ను రౌడీ అంటూనే నేరారోపణలున్న సల్మాన్ అనే వ్యక్తిని కేటీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. సల్మాన్ పై బిఆర్ఎస్ హయాంలోనే అధికంగా కేసులు నమోదయిన విషయాన్నీ కేటీఆర్ మరచిపోయినట్టుంది.

ప్రజలు వింటున్నారనో, చెబితే నమ్ముతారనో ఏదిపడితే అది మాట్లాడితే చివరకు అవమానం ఎదుర్కోవాల్సిందే. కేటీఆర్ తన స్థాయిని మరచిపోయి చవకబారు మాటలు మాట్లాడితే జనం కూడా సహించే పరిస్థితిలేదు. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో జనం కూడా పట్టించుకోరు. ఇప్పటికయినా కేటిఆర్ భాష మారితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాలు గులాబీ శ్రేణులతోపాటు, రాజకీయ వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్నాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.