KTR : భాష మారితేనే భవిష్యత్తు….

KTR : నోటి మాట జారిన వ్యక్తి.....యుద్ధంలో ఆయుధం జారవిడిచిన వ్యక్తి ... ఈ ఇద్దరూ ఒకటే అంటారు పెద్దలు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులకు తిరుగులేదని కళలు కన్నారు. అధికారం కోల్పోయిన తరువాత పలువురు గులాబీ నేతల నోటి మాటకు అదుపు లేకుండా పోయింది. అందులో పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఒకరు అని చెప్పక తప్పదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడితే ఆ మాటలు వింటున్న జనం కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు....