అడ్రియాల ప్రాజెక్ట్ 13 శాతం
మందమర్రి ఏరియా 68 శాతం
Singareni :సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ జూన్ నెలలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిలో కొంతమేరకు ఆశించించిన ఫలితాన్నే సాధించిందని చెప్పవచ్చు. కేటాయించిన లక్ష్యాన్ని సాధించి రామగుండం -2 ఏరియా మిగితా ఏరియాల కంటే ముందంజలో ఉంది. చివరి స్థానంలో అడ్రియాల ప్రాజెక్టు. జూన్ మాసంలో అప్పుడప్పుడు వర్షాలు కురిసినప్పటికీ సింగరేణి అధికారులు, సూపర్ వైజర్లు, కార్మికులు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం విశేషం.
జూన్ మాసంలో 49,56,235 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం లక్ష్యం గ అధికారులు నిర్ణయించారు. సమిష్టి కృషితో 49,43,687 టన్నుల బొగ్గు ఉత్పత్తి ని సాధించడం విశేషం. ఏరియాల వారిగా బొగ్గు ఉత్పత్తి సాధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం -1 ఏరియా 94 %,, రామగుండం-2 ఏరియా 139 %, రామకుండం -3 ఏరియా 84 %, భూపాల పల్లి 79 %, బెల్లంపల్లి 129 % మందమర్రి 68 %, అడ్రియాల 13 %, కొత్తగూడెం 109 %, మణుగూరు 105 %, ఇల్లందు 103 % బొగ్గు ఉత్పత్తిని సాధించర్యి.
రాబోయే రెండు నెలలు వర్షాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు నిల్వ ఉండకుండా సంబంధిత అధికారులు చేపడుతున్నారు. వర్షాల వలన బొగ్గు ఉత్పత్తి కి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా సింగరేణి సి అండ్ ఎండి బలరాం నాయక్ తెలిపారు.