mlc kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. తన వెంట ఎందరు ఉన్నారు. వారిని చూసి ప్రజలు ఏమనుకుంటారో అనే విషయాన్నీ పట్టించుకోవడంలేదు. తన వెంట ఎంతమంది కార్యకర్తలు వస్తే వారితోనే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా కేవలం జాగృతి శ్రేణులే. జాగృతి క్యాడరుతోనే ప్రభుత్వం పై పోరాటం చేస్తోంది. కానీ మా నాయకుడు కేసీఆర్. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ స్పష్టంగా చెప్పేస్తున్నారు. జూలై లో కవిత రైల్ రోకో కార్యక్రమాన్ని బిసి రిజర్వేషన్ కోసం చేపడుతున్నారు.
రైల్ రోకో ఒక్కరితో సాధ్యమయ్యే విషయం కాదు. మరికొందరిని కూడా కలుపుకొని రావాలి. ఒకవేళ ఇతర పార్టీలను అహానిస్తే పేరు కవితకే దక్కుతుంది. కాబట్టి పిలిచిన వారి వచ్చేది కూడా నమ్మకం తక్కువే. ప్రస్తుతానికి బీసీ సంఘాలను కదిలించడంలో భాగంగా ఆర్ కృష్ణయ్య తో చర్చించారు కవిత. ఆయన మద్దతు కూడా ప్రకటించారు. కవిత ఎర్ర జెండా నాయకులను కూడా కలుస్తున్నారు. వాళ్ళు కూడా కాదనలేక ఒకే చెప్పేసారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది. బిఆర్ఎస్ పాల్గొంటుందా అనే అనుమానాలు సైతం రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి. దీనికి కవిత వద్ద సమాధానం కూడా లేదు. గులాబీ శ్రేణులను ఆహ్వానిస్తున్నారా ? అంటే కూడా స్పష్టత లేదు. ఒకవేళ కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే గులాబీ శ్రేణులు కదులుతారు. కేసీఆర్ చెప్పే పరిస్థితి వీసమంతా కూడా కనబడుటలేదు. రైల్ రోకో అనంతరం బిఆర్ఎస్ కు కవిత మద్య అంతరం మరింత పెరుగుతుందని కూడా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.