Women : ఆర్థిక వేత్త చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాల్లో చాలా విలువైనవి ఉన్నవి. వాటిలో కాబోయే జీవిత భాగస్వామి గురించి కూడా కొన్ని సత్య సూత్రాలు తెలిపారు. ఆ ఐదు గుణములు కనబడిన వ్యక్తి కనబడితే పెళ్లిచేసుకోవాల్సిందే అంటున్నారు చాణక్యుడు… వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం….
కొందరు యువతులు ఎదో ఒకటి కోల్పోయినట్టుగా దీనంగా ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికి తట్టుకొని నిలదొక్కుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కాబట్టి అటువంటి స్త్రీ ఉత్తము రాలవుతుంది.
నిత్య జీవితంలో ఓపిక అనేది ప్రతి వ్యక్తికీ ఉండాలి. ఓపిక లేని వ్యక్తులతో కలిసిమెలిసి ఉండలేము. అటువంటి వ్యక్తి భార్యగా వస్తే ఎలా కాపురం చేస్తామని చాణక్యుడి ప్రశ్న. కాబట్టి సహనం ఉన్న వ్యక్తితోనే పెళ్లి చేసుకోవాలంటున్నాడు.
వ్యక్తులకు కోపం సాధారణంగా ఉంటుంది. కోపం అనేది అనేక అనర్దాలకు హేతువు అవుతుంది. క్షణికావేశంలో ఏదయినా చేదు జరుగుతుంది. కోపంతో ఎలాంటి బంధం అయినా తెగిపోతుంది. కోపం శత్రువుతో సమానం. కోపాన్ని అదుపులో పెట్టుకున్న వారు దేన్నయినా సాధించగలుగుతారు. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకునే అమ్మాయిని కనబడితే పెళ్లిచేసుకోవాల్సిందే అంటున్నాడు చాణక్యుడు.
నిత్య జీవితంలో సర్దుకు పోవడం అనేది చాలా ముఖ్యం. ఉన్నదాంట్లో తృప్తి పడాలి. లేనిదాని గురించి ఆశించరాదు. కోరికలను అదుపులో పెట్టుకొని, ఉన్నదాంట్లో సర్దుకుపోయే వ్యక్తిత్వం ఉన్న మహిళ కనబడితే పెళ్లి చేసుకోవాల్సిందే అంటున్నాడు చాణక్యుడు.