Singareni : రక్షణతోనే బొగ్గు ఉత్పత్తిని సాధిద్దామని మందమర్రి ఏరియా సింగరేణి కాసిపేట-1గని కె కె గ్రూపు ఏజెంట్ రాంబాబు స్పష్టం చేశారు. కెకె గ్రూప్ ఏజెంట్ గ అయన భాద్యతలు చేపట్టిన అనంతరం మంగళవారం ఏరియాలోని కాసిపేట-1 గనిని సందర్శించారు. ఈ సందర్బంగ ఏజెంట్ రాంబాబుకు గని అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగ ఏజెంట్ రాంబాబు మాట్లాడుతూ ప్రతి కార్మికుడు ముందుగా రక్షణ సూత్రాలను పాటించాలన్నారు.
అధికారులు, సూపెర్వైజర్లు, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు సమిష్టి కృషితో భాద్యతలు నిర్వహించినప్పుడే గనిలో ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరి మధ్య అవగాహన ఉన్నపుడే సింగరేణి సంస్థ లాభాలు సాధిస్తుందన్నారు. ఈ సందర్బంగా ఏజెంట్ రాంబాబును అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాసిపేట గని మేనేజర్ భూసంకరయ్య, రక్షణ అధికారి నిఖిల్ అయ్యర్, పిట్ ఇంజనీర్ మధుకర్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్, సర్వేయర్ ప్రభాకర్, ఖాన్, రాజ్ కుమార్, ఇంజనీర్ రామకృష్ణ తో పాటు AITUC రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్, పిట్ సెక్రటరీ మీనుగు లక్ష్మీనారాయణ, బెల్లంపల్లి బ్రాంచి ఇన్ చార్జి చిప్ప నర్సయ్య,వైస్ ప్రెసిడెంట్ బియ్యల వెంకట స్వామి, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మన్ దాస్ తో పాటు నాయకులు జాడి ఫోషం, రాజేందర్, అశోక్, రంజిత్, రాజన్న, రవి, సంపత్ తదితరులు పాల్గొన్నారు,