Water : శీతాకాలం, వర్షాకాలం, వేసవి కాలం. ఈ మూడు కాలాల్లో వేసవి కాలాన్ని తట్టుకోవడం చాలా కష్టమే. మండే ఎండలో ప్రయాణం చేయడం చాలా కష్టం. ఎంత నీరు తాగినా దాహం తీరదు. దాహం దీరడానికి కూల్ డ్రింక్స్, జ్యుస్, చల్లని పదార్తాలు తీసుకుంటాం. అయినప్పటికీ దాహం తీరదు. దాహం తీరడం లేదని ఎంత అయితే అంత నీరు తాగరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో శరీరానికి ఎంత అవసరమో ఆరోగ్య నిపుణులు ఈ విధంగా చెబుతున్నారు.
రాత్రి నిద్రపోవడం నుంచి మొదలుకొని ఉదయం నిద్రలేచేసరికి వ్యక్తి శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోతాయి. అందుకనే నిద్రలేవగానే నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మూత్రం కొంచెం లేత పసుపు రంగులో వస్తుంది. నీళ్లు ఎక్కువ తాగినా మూత్రం అదే రంగులో వస్తుంది. ఎక్కువసేపు నీరు తాగకుంటే మూత్రం ముదురు పసుపు రంగులో వస్తుంది. కొన్ని సమయాల్లో మూత్రంలో మంట కూడా వస్తుంది. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం ఒక లీటర్ నుంచి ఒకటిన్నర లీటర్ వరకు మూత్రం విసర్జించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కార్యాలయంలో పనిచేసే వారు రోజుకు రెండు లీటర్ల వరకు నీళ్లు తాగాలి. వేసవిలో కార్మికులకు చెమట రూపంలో నీటి నిల్వలు శరీరం నుంచి ఎక్కువ బయటకు పోతాయి. కాబట్టి వారు రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.