green peas : పచ్చి బఠాణి గింజలు అందరికి తెలిసినవే. ఫ్రై చేసుకొని తింటారు. కూర వండుకొని తింటారు. కానీ చాలా మందికి వాటితో ఉన్న ప్రయోజనాల గురించి తెలియదు. వాటిని తినడం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నాల్లో భాగంగా పచ్చి బఠాణీలను ఆహారంగా తీసుకోవడం మంచిది. దీనిలో విటమిన్ ఏ, భాస్వరం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. కండరాలు బలంగా తయారవుతాయి. బఠాణీలు తినేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యల నుండి రక్షిస్తుంది.
అలసట, బలహీనత వంటి సమస్యలను నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు సహాయ పడుతుంది.. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ ను అదుపులో పెడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.