marriage : కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోనున్నది. ఇంతకు ముందు ఇచ్చే పారితోషకం ఉత్తర్వులను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2021 లో వివాహం చేసుకున్న వారికి ఇప్పటివరకు ప్రోత్సాహకం అందలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బీసీ శాఖ రూ : పది వేలు, ఎస్సీ శాఖ రూ : 50 వేల ప్రోత్సాహకం మంజూరైనాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ : 5 లక్షలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కులాంతర వివాహం చేసుకున్న దంపతులు ఈ-పాస్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ లో దరఖాస్తులో ఇచ్చిన వివరాలను డౌన్ లోడ్ చేసుకొని వాటిని జిల్లా సంబంధిత అధికారి కార్యాలయంలో అందజేయాలి.
సంబంధిత అధికారులు చేసిన దరఖాస్తును పరిశీలిస్తారు. వివరాలు అన్ని సరిగా ఉంటె చెక్ లేదంటే బ్యాంకు లో నగదు జమ అవుతాయి. వివాహం చేసుకున్న వారి కులం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, విద్యార్హతలు, బ్యాంకు ఎకౌంట్ వివరాలు సరిగా ఉండాలి. ఇంటి చిరునామా సరిగా ఉండాలి. ఆధార్ లో ఉన్న చిరునామాలో నివాసం ఉంటె విచారణ తొందరగా పూర్తవుతుంది.