Mela : పచ్చని ప్రకృతికి నిలయమైన గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా పూజించి, స్నానమాచరించే మహా కుంభమేళా. ఈ అరుదయిన, అపురూపమయిన ఘట్టం చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఆ మహా కుంభమేళా ప్రయాగరాజ్ లో జరుగనుంది. గంగ, యమున, సరస్వతీ నదుల సమ్మేళనమయిన త్రివేణి సంగమంలో స్నానమాచరించడమే. దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు ఈ మహా కుంభమేళాకు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. గుడారాలు, తాత్కాలిక వంతెనలు, తాగునీటి సౌకర్యం, ఘాట్ లు ఏర్పాటుచేసింది. ఇక్కడకు వచ్చే సాధువులు ఉండటానికి, పూజలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అన్ని వసతులతో ఒక పెద్ద పట్టాణాన్నే నిర్మించారు. 24 గంటలు ఉచిత వైద్య సేవలతో పాటు, ఉచిత భోజనం సైతం అందజేయనున్నారు.
ఖచ్చితంగా చెప్పాలంటే ఈ మహా కుంభమేళ ముగిసేవరకు 45 రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 45 కోట్ల మంది భక్తులు వఛ్చి ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తారని అధికార గణాంకాలు చెబుతున్నాయి.