Home » Mela : కుంభమేళా అర్థం ఇదే ….

Mela : కుంభమేళా అర్థం ఇదే ….

Mela : కుంభమేళా అంటే అనేక మంది హిందూ భక్తులు గంగమ్మ తల్లి వద్దకు చేరుకొని స్నానమాచరించే పండుగనే కుంభమేళా. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది.జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ప్రయాగ జరిగే కుంభమేళాకు సుమారు 45 వేల కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి.

సూర్యుడు, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభ మేళాను నాసిక్ లోని త్రయంబకేశ్వర్ లో నిర్వహిస్తారు. అదేవిదంగా సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభ మేళా ప్రయాగ లో జరుగుతుంది. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహించడం జరుగుతుంది.

కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్ధం గల పదం. దీనికే కలశం అనే అర్ధం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశి లోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి, కలయిక లేదా జాతరగా అని కూడా భావించవచ్చు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *