Home » Puspa -2 : పుష్ప-2 కలెక్షన్లు…ఎన్ని కొట్లో తెలుసా ?

Puspa -2 : పుష్ప-2 కలెక్షన్లు…ఎన్ని కొట్లో తెలుసా ?

Puspa -2 : పుష్ప-2 సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి అభిమానుల్లో ఆత్రుత పెరిగింది. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడసాగారు. సినిమా రానే వచ్చేసింది. అభిమానుల కోరిక తీరింది. అభిమానుల ఆశయాలకు తగ్గట్టుగా సినిమా చిత్రీకరించారు. దింతో అభిమానులు సంబరాల్లో మునిగి పోయారు. కానీ సినిమా పెట్టుబడికి తగిన కలెక్షన్లు వస్తాయా ? రావా ? అనే సందిగ్ధంలో పడిపోయారు చిత్ర బృందం తో పాటు అల్లు అర్జున్ అభిమానులు. కానీ పుష్ప-2 కలెక్షన్ లు ఎంత గోరంగా ఉన్నాయంటే, చెప్పలేంతగా ఉన్నాయి. కలెక్షన్ల పర్వం చూస్తుంటే మతిపోతోంది.

పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమిటో చూపించింది. నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది ఇప్పుడు సరికొత్త రికార్డ్. ఈ సినిమా అత్యధిక వసూళ్లు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుంది.

సినిమా విడుదల అయిన ఒక్క రోజుననే ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఆదివారం ఒక్కరోజే రెండు వందల కోట్ల వరకు వసూలు అయ్యింది. హిందీ మార్కెట్లో రూ.86 కోట్లు కలెక్షన్లు చేసింది. ఐదో రోజు రూ.80 నుంచి వంద కోట్లు వరకు వచ్చినట్లు సమాచారం.

ప్రతిరోజూ పుష్ప-2 సినిమా సగటున రూ : 200 కోట్ల కలెక్షన్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం సమాచారం. గడిచిన ఐదు రోజుల్లోనే రూ : 900 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు సినీవర్గాల సమాచారం. చిత్రం పెట్టుబడిదారుల అభిప్రాయం ప్రకారం రూ : వెయ్యి కోట్ల కలెక్షన్ దాటిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని సినీవర్గాల అభిప్రాయపడుతున్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *