Jim : మీ ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి జిమ్ వెళుతున్నారా ? అటువంటప్పుడు మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీరు చేసే జిమ్ మీకు సద్వినియోగం అవుతుంది. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవలో ఇప్పుడు తెలుసుకుందాం….
మీరు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఉన్న పదార్తలను తీసుకుంటేనే మీ కండరాలు పటిష్టంగా ఉంటాయి. ప్రోటీన్ లేని పదార్థాలు తీసుకొని జిమ్ చేసే వారి కండరాలు బలహీనంగా తయారవుతాయి. జిమ్ చేసేవారు చీజ్ తీసుకోవడం ఆరోగ్యకరం. చీజ్ వలన జీర్ణక్రియ మెరుగవుతుంది. కండరాలు పటిష్టంగా ఉంటాయి. జున్ను రాత్రి పూట తినడం వలన కండరాలు బలంగా తయారవుతాయి.
పప్పులు తినడం వలన శక్తి సామర్థ్యం పెరుగుతుంది. సోయాబీన్ ను కూడా తినడం వలన పటిష్టంగా తయారవుతారు. కాజు, బాదం, వాల్ నట్, చియా సీడ్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండ తినడం వలన జిమ్ చేసే వారు ఆరోగ్యముగా తయారవుతారు.