Srisailam : ఏపీ లోని పవిత్ర శ్రీశైలం క్షేత్రంలో కలకలం రేగింది. జరిగిన సంఘటనతో దేవస్థానం కమిటీ, సంబంధిత అధికారులు, భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. జరిగిన సంఘటన వివరాలు సేకరించి ఆలయ కమిటీ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఇద్దరు వ్యక్తులు శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురం వద్ద డ్రోన్ ఎగురవేశారు. గాలిలో డ్రోన్ ఎగురుతున్న సమయంలో ఆలయం రక్షణ సిబ్బంది గమనించి అప్రమత్తమయ్యారు. దేవస్థానం అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ ఎగురవేసిన వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.