TNSFపెద్దపల్లి పార్లమెంట్ నాయకులు ఎండి వాజిద్ డిమాండ్
TNSF : తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్ లెక్చరర్ల వేతనాలు వెంటనే మంజూరు చేయాలని TNSFపెద్దపల్లి పార్లమెంట్ నాయకులు ఎండి వాజిద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో అయన మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభం అయిన నాటి నుంచి అధ్యాపకులకు ప్రబుత్వం వేతనాలు ఇవ్వకపోవడంపై వాజిద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గడిచిన ఐదు నెలల్లో ఒక్క నెల వేతనం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న వారి కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయన్నారు. జూనియర్, డిగ్రీ విద్యార్థుల ఫలితాలు ప్రభుత్వం ఆశించిన మేరకు వచ్చినప్పటికీ ప్రభుత్వం వారి కష్టాలను పట్టించుకోకపోవడంపై వాజిద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని వాజిద్ ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.