CM Revanth Reddy : హైదరాబాద్ నగరం చిన్న వర్షానికే వణికిపోతోంది. నాళాలు. డ్రైనేజీ లు నిండిపోతాయి. ఇళ్లలోకి నీరు చేరుతుంది. దింతో కుటుంబాలు పస్తులతో గడపాలి. ఇదంతా ఎందుకు జరుగుతుందనే సమస్యను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములు, ఖాలీ స్థలాలు, రోడ్లు, చెరువులను కబ్జా చేయడంతోనే అని ప్రభుత్వం భావించింది. ఈ ససమస్యను పరిష్కరించడానికి పక్కా ప్రణాలికను రూపొందించింది ప్రభుత్వం.
కానీ ఇదే సమస్యను గతంలో కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. సమస్య పరిస్కారం కోసం కబ్జాదారులకు గట్టి హెచ్చరిక కూడా ప్రభుత్వం నుంచి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం నుంచి సీరియస్ హెచ్చరిక రావడంతో కబ్జాదారులంతా కూడా బయపడిపోయారు. ప్రభుత్వ యంత్రాంగం కొరడా జుళిపిస్తే తమ కట్టడాలు అంతా కూడా నేలకూలడం ఖాయమనే భయం పట్టుకుంది.
హెచ్చరికలతో ఎంత భయపడిపోయారో అంత స్వేచ్ఛ దొరికింది కబ్జాదారులకు. అక్రమార్కులపై ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు. చివరకు నోటీసు ఇచ్చి కూడా చేతులు దులుపుకున్న పరిస్థితి ఎక్కడ కనబడలేదు. ఈ నేపథ్యంలో గులాబీ పాలనలో కబ్జాదారుల కన్ను ఎక్కడ పడితే అక్కడ పాగావేశారు. ప్రభుత్వ భూములు అక్షయ పాత్ర అయినాయి. చెరువులు కనబడకుండా పోయాయి. డ్రైనేజి సైతం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళింది.
నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదంటూ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. చర్యలు తీసుకునేటప్పుడు కులం, బంధుత్వం, రక్త సంబంధం చూడకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా పేరు వింటేనే అక్రమార్కులు ఉలిక్కిపడుతున్నారు.
హైడ్రా తీసుకుంటున్న చర్యలు చూసిన హైదరాబాద్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుందని హైడ్రా గణాంకాలు చెబుతున్నాయి. అక్రమ నిర్మాణాలను తొలగించడంలో కేసీఆర్ కు సాధ్యం కాలేదు. కేవలం ప్రకటనలకే పరిమితమవుతూ ” మమ ” అనిపించారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు సత్పలితాలను ఇస్తున్నాయి. హైడ్రా దూకుడు ఇదేవిదంగా కొనసాగుతుందా లేదంటే మధ్యంతరంగా రాజకీయ ఒత్తిళ్లతో నిలిపివేస్తుందా అనే అనుమానాలు సైతం హైదరాబాద్ ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.