Home » Rented House : అద్దె ఇంటికి వెళ్లినా ఇవి చూడండి…. లేదంటే తిప్పలు, అప్పులు తప్పవు

Rented House : అద్దె ఇంటికి వెళ్లినా ఇవి చూడండి…. లేదంటే తిప్పలు, అప్పులు తప్పవు

Rented House : మనం సొంతంగా ఇంటిని నిర్మించుకుంటున్నామంటే ఖచ్చితంగా వాస్తు శాస్త్రంను అనుసరిస్తున్నాం. వాస్తు ప్రకారం ఇళ్లు కట్టుకుంటేనే సుఖ,సంతోషాలతో పాటు ఆర్థికంగా ఉంటామనేది నమ్మకం. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకొని సుఖంగా ఉంటున్నారు. అదేవిదంగా సొంత ఇల్లు లేనివారు అద్దె ఇంటిలో ఉంటున్నారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు అన్ని సౌకర్యాలు ఉన్న అద్దె ఇంటినే ఎంచుకుంటున్నారు.

సౌకర్యాల వరకు బాగానే ఉంది. కానీ వేదం చెప్పిన ప్రకారం అద్దె ఇంటికి వెళితే కూడా వాస్తు ప్రకారం ఇంటిని కట్టారా లేదా అనేది తప్పనిసరిగా చూడాలని వేదం పండితులు చెబుతున్నారు. ఇల్లు వాస్తుకు అనుగుణంగా లేకుంటే ఆ ఇంటికి వెళ్లిన వారికి తిప్పలు తప్పవు. అంతే కాదు అప్పులు కూడా తప్పవని వేదం పండితులు చెబుతున్నారు.

కేవలం సౌకర్యాలను చూసి అద్దెకు ఉండరాదు. వాస్తు నిబంధనల ప్రకారం ఇంటి యజమాని నిర్మించాడా లేదా అనేది చూడాలి. అదేవిదంగా ఆ ఇంటి యజమాని ఆర్థిక పరిస్థితి, కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా తెలుసుకోవాలి. ఆయన, ఆయన కుటుంబం అన్ని విధాలుగా బాగుంటేనే ఆ ఇంటికి అద్దెకు వెళ్ళాలి. ఆ ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉంటె ఆ ఇంటికి వెళ్ళకండి.

మీరు ఎంపిక చేసుకున్న ఇంటి అద్దె ఎంత ఉంది. చుట్టుపక్కల అద్దె ఎలా ఉంది అనే విషయాలను ముందుగా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు ఎంపిక చేసుకున్న ఇంటి అద్దె తక్కువగా ఉంటె ఆ ఇల్లు వాస్తు ప్రకారం కట్ట లేదని భావించాలి. ఆ ఇంటి యజమానికి ఆ ఇల్లు కలిసి రాని నేపథ్యంలోనే ఎవరు ఆ ఇంటికి అద్దెకు రావడం లేదని అర్థం చేసుకోవాలి. కాబట్టి అద్దె తో కూడా ఇంటి పరిస్థితి తెలిసిపోతుంది. అందుకే అన్ని విధాలుగా ఆలోచించి వాస్తు ప్రకారం ఉన్న ఇంటికే అద్దెకు వెళ్ళండి. కిరాయి ఎక్కువ అని ఆలోచించకుండా గృహ ప్రవేశం చేయండి. సుఖ,సంతోషాలతో గడపండి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *