Dy . CM Suting : గడిచిన కొద్ధి నెలల పాటు రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపారు రాష్ట్ర డిప్యూటీ సీఎం. ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. క్షణం తీరిక లేకుండా గడిపారు. రాజకీయం పరంగా గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలను ఢీకొన్నారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ప్రభుత్వం ఏర్పాటైనది. మంత్రి పదవుల కేటాయింపులో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలకమైన మంత్రి పదవులు సైతం దక్కాయి. భాద్యతలు చేపట్టడం కూడా పూర్తయినది.
ఇప్పుడు ఆయన సినిమా షూటింగ్ లపై దృష్టి సారించినట్టు తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకూ సినిమా రంగం వైపు దృష్టి పెట్టింది ఏ రాష్ట్ర డిప్యూటీ సీఎం అనుకుంటున్నారు. ఇంకెవరు ఆయనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం.
హరి హర వీరమల్లు సినిమా సగం షూటింగ్ పూర్తయినది. మిగతా సగ భాగం పూర్తి చేయడానికి సంబందించిన పనులను ప్రారంభించినట్టు నిర్మాత ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. రాజకీయ కారణాల వలన హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ నిలిచిపోయిన నాటి నుంచి అయన అభిమానులు షూటింగ్ ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతుందా ? ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
డైరెక్టర్ క్రిష్ కూడా షూటింగ్ నిలిచిపోయిన నాటి నుంచి నేటి వరకు షూటింగ్ కు దూరంగానే ఉన్నారు. నిర్మాత ఎంఎం రత్నం కూడా సినిమాను ఎన్నికల కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ప్రకటించారు. కానీ సాధ్యం కాలేదు. సినిమాకు సంబందించిన గ్రాఫిక్స్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయని నిర్మాత ప్రకటించారు. సినిమాకు సంబంధించి ఇంకా మచిలీపట్నం పోర్ట్ షూటింగ్, కుస్తీ ఎపిసోడ్, చార్మినార్ ఎపిసోడ్ వంటివి మిగిలి ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని యాక్షన్ గ్రాఫిక్స్ ఎపిసోడ్ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉందని నిర్మాత ప్రకటించారు.