Bad Times Be Alert : ఎవరికయినా వాళ్ళ ఇంటిలో చెడు జరగడానికి ముందు, ఆ ఇంటిలో కొన్ని సంకేతాలు కనబడుతాయి. కానీ వాటిని మనం గుర్తించం. ఒక్కో సంకేతం, ఒక్కో చెడుకు గుర్తుగా ఉంటది. కానీ అవన్నీ కూడా మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాల ఆధారంగా కళ్ళెదురుగా కనబడే కొన్ని సంకేతాలు ముందస్తుగా హెచ్చరిస్తున్నట్టుగా గమనించాలి.
ఆర్థిక ఇబ్బందులు : ఎలాంటి కారణం లేకుండానే ఇంటి కుటుంబ సభ్యలు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. లేదంటే ఒక సమస్య పరిస్కారం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది మంచిది కాదని తెలుసుకోవాలి. అదేవిదంగా అనుకోకుండా ఇంటిలో దొంగలు పడటం, విలువైన వస్తువులను పోగొట్టుకోవడం కూడా అశుభానికి హెచ్చరికగా భావించాలి.
తులసి మొక్క : ఇంటిలో పెట్టుకున్న తులసిమొక్క కొద్దీ, కొద్దిగా ఎండిపోవడం ప్రారంభం అవుతుంది. అంటే అప్పుడు మన ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు ప్రారంభం అవుతున్నట్టుగా భావించాలి. డబ్బు ఆధారిత సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుసుకొని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పూజ : ఇంటిలో ఏదయినా ఒక దేవుని నామం ఉచ్చరిస్తూ ఉండాలి. దేవుడిని కనీసం వారంలో ఒకరోజు అయినా పూజించాలి. దేవుడిని స్మరించకపోవడం, దేవుడికి దీపం పెట్టక పోవడం వలన ఇంటిలో వ్యతిరేక పవనాలు క్రమ, క్రమంగా పెరుగుతాయి. చేస్తున్న పనులు కూడా చెడిపోతాయి. అటు అంటి ఇంటిలో లక్ష్మి దేవి కూడా నిలకడగా ఉండదు.
గాజు వస్తువులు : ఇంటిలో అప్పుడపుడు గాజు వస్తువులు పగిలి పోతుంటాయి. అదేవిదంగా ఇంటిలో మనం చూసుకునే అద్దం పగిలి ఉండరాదు. అటువంటి అద్దాన్ని కూడా చూడకూడదు. పగిలిపోయిన గాజు వస్తువులను ఇంటిలోనుంచి తీసివేయాలి. గాజు వస్తువులు తరచుగా పగిలిపోవడం, అద్దం పగిలి పోవడం జరుగుతున్నాయంటే ఆ ఇంటిలో ఆర్థిక సమస్యలు మొదలవుతున్నాయని అర్థం. నోట్: ఈ అంశాలన్నీ కూడా కేవలం గ్రంథాల ఆధారంగా సేకరించినవి మాత్రమే…..