23.9 C
Munich
Monday, July 27, 2026

TTD Amount Annadhanam : తిరుమల వెంకన్నస్వామి అన్నప్రసాదం రోజు ఖర్చు ఎంతో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

How Much Amount Annadhanam : ఎంత ఖర్చు అయినా సరే భరించి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించు కోవాలనుకుంటారు భక్తులు. కష్టాన్ని ఓర్చుకొని అయినా జీవితంలో ఒక్కసారి అయినా ఆ ఏడుకొండల వెంకన్నను తనివితీరా చూడాటానికి వెళ్లివస్తారు భక్తులు. తన వద్దకు వచ్చే భక్తులకు ఆ ఏడుకొండల స్వామి ఎలాంటి కష్టాన్ని కలుగజేయడు. అదేవిదంగా తనకు ఎలాంటి కానుకలు ఇవ్వక పోయినా పరఫాలేదు.

కానీ తన వద్దకు భక్తుల ఆకలిని తీర్చే భాద్యత కూడా తనదే అంటూ భారం వేసుకుంటాడు. ఒక పూట అల్ఫాహారం, రెండు పూటల భోజనం నిత్యం భక్తులకు అందుబాటులో స్వామి తన సన్నిధిలో ఉంచుతాడు. ప్రతిరోజు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం సముదాయంలో భోజనం, అల్ఫాహారం భక్తులకు అందుబాటులో ఉంటుంది. భోజనంలో తీపి పాయసం, ఒక కూర, పచ్చడి, సాంబారు, రసం, మజ్జిగ, అన్నం అరటి ఆకులో సేవకులు వడ్డిస్తారు. స్వామి దర్శనం కోసం వెళ్లిన వారికీ ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా మాకు అల్ఫాహారం కానీ, భోజనం కాని దొరకలేదని భక్తులు చెప్పక పోవడం విశేషం.

కొండలపైన తిరుమల తోపాటు, తిరుపతిలోని అన్న ప్రసాదం సముదాయాలల్లో ప్రతిరోజు సుమారుగా రెండు లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తున్నట్టు టీటీడీ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కొండలపైన తిరుమలలోని సత్రంలో సుమారుగా ఒక లక్ష దెబ్బయ్ అయిదువేల మంది భక్తులు, అదేవిదంగా తిరుపతిలో సుమారు ఇరువై ఐదువేల మంది భక్తులు ప్రతిరోజూ అన్న ప్రసాదం స్వీకరిస్తున్నట్టు టీటీడీ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కరోజు భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి పెట్టె అన్న ప్రసాదం ఖర్చు సుమారుగా నలబై లక్షల రూపాయలుగా టీటీడీ అధికార గణాంకాలు చెబుతున్నాయి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.