BRS Celebrates : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతోంది. అత్యంత భారీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేడుకలకు బిఆర్ఎస్, బీజేపీ లను ఆహ్వానించడం లేదు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే విదంగా రాష్ట్రంలో పరిపాలన జరిగింది. రాష్ట్రానికి సంబందించిన ఏ వేడుక అయినా కేసీఆర్ కనుసన్నల్లోనే జరగాలి. అటువంటి నేతకు ఇప్పుడు ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు పోటీగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించబోతున్నారు. పార్టీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేసి, ఘనంగా ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రము సాధించుకొని పదేళ్లు కాలేదు. అయినా గత ఏడాది జూన్ రెండో తేదీన కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. అప్పుడు ఉత్సవాలకు ప్రజల నుచి మిశ్రమ స్పందన కనిపించింది. పార్టీ శ్రేణులు మాత్రం అధిక సంఖ్యలో పాల్గొని పండుగ చేసుకున్నారు. సంవత్సరం పాటు వేడుకలు నిర్వహించి, అధికారంలోకి వచ్చిన తరువాత ముగింపు ఉత్సవాలను ఓ స్థాయిలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుకున్నది ఒకటి. జరిగింది ఒకటి.
గులాబీ శ్రేణుల ఆధ్వర్యంలోనే దశాబ్ది వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నారు. జూన్ ఒకటిన గన్ పార్క్ నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన, రెండో తేదీన అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం. మూడో తేదీన పార్టీ కార్యాలయంలో ముగింపు వేడుకల్ని జరపాలని అధినేత కేసీఆర్ పార్టీవర్గాలను ఆదేశించినట్టు సమాచారం.
రాష్ట్రంలో అధికారంలో లేము. కాబట్టి ప్రజలను భాగస్వాములను చేయడం కష్టమే అవుతుంది. కేవలం పార్టీ నిర్వాహకులతోనే తెలంగాణ ఆవిర్భావ వేడుకలను వీలైనంత మేరకు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.