CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైనప్పుడే జనంలో అనుమానాలు మొలకెత్తాయి. మూడోసారి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలోకి వస్తే యధావిధిగా పరిపాలన కొనసాగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజల్లో చర్చ జరిగింది.
వివిధ పార్టీల నాయకుల్లో కూడా ప్రజలకు వచ్చిన అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆ అనుమానాలే నిజమవుతున్నాయి. అందరు అనుకున్నదే తెలంగాణ రెండో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేసీఆర్ వేసిన అధికార ముద్రను తొలగించడానికి రేవంత్ రెడ్డి తనదయిన శైలిలో అడుగులు వేశారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
తెలంగాణ తల్లి గా కేసీఆర్ తయారు చేయించిన విగ్రహంలో మార్పులు తీసుకురాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దొరసానిలా విగ్రహం ఉందని కూడా గతంలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ తల్లి పేరుతో మరో విగ్రహాన్ని తాయారు చేయిస్తున్నారు సీఎం. అదేవిదంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కూడా మార్పులు చేయబోతున్నారు. చిత్ర కారుడు రుద్ర రాజేష్ తో చిహ్నంలో మార్పులు, చేర్పుల గురించి చర్చించారు. దీనితో తెలంగాణ చిహ్నం లో మార్పులు జరగడంఖాయమని తేలిపోయింది.
తెలంగాణ రాష్ట్ర గీతంలో కూడా మార్పులు జరగబోతున్నాయి. దీనికి సంబందించిన మార్పుల గురించి కూడా ప్రముఖ కవి అందె శ్రీ, తోపాటు తెలుగు సినీ సంగీత దర్శకుడు కీరవాణి ని కలిసి చర్చించారు. ప్రత్యేక గీతంలో కొన్ని పదాలను తొలగించి, మరికొన్ని కొత్త పదాలను చేర్చబోతున్నారు. బ్యాక్ గ్రౌండ్ సంగీతాన్ని కూడా మార్చబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ను కూడా మార్చింది ప్రభుత్వం.
మొత్తానికి పక్కా వ్యూహంతోనే సీఎం రేవంత్ రెడ్డి తన ముద్ర వేసుకోడానికి చర్యలు వేగవంతం చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైనది. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే పనిలో భాగంగానే మార్పులు, చేర్పులు చేయబోతున్నారని రాజకీయ శ్రేణుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.