Home » Allari Naresh : మాస్ పాత్రలో నరేష్ లొల్లి

Allari Naresh : మాస్ పాత్రలో నరేష్ లొల్లి

Allari Naresh : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు హీరోలు ఇటీవల మేకోవర్ పాత్రలపై దృష్టి సారించారు. ప్రవర్తన దురుసుగా, ఉండటం, మాసిన గడ్డం, నోటిలో బీడీ, రంగు, రంగుల దుస్తులు, నుదిట పెద్ద బొట్టు, చిన్నగా మాట్లాడుతూ పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు వస్తున్నాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్, దసరా సినిమాలో నాని కొత్త తరం నటనతో అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. ఇప్పుడు వారి బాటలోనే అల్లరి నరేష్ నటించి సినిమా థియేటర్లలో లొల్లి చేయడానికి సిద్దమయ్యాడు.

అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న చిత్రం ” బచ్చల మల్లి ” ఈ సినిమాకు దండా పెట్టుబడిపెడుతున్నారు. దర్శకుడిగా రాజేష్ వ్యవహరిస్తున్నారు. సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ను ఇటీవలనే సినిమా సాంకేతిక వర్గం తో కలిసి నటీ, నటులు, దర్శక, నిర్మాతలు విడుదల చేశారు. ఇందులో నరేష్ వేషధారణ చాల రఫ్ గా కనబడుతోంది. మెషిన్ గడ్డం, కలర్ ఫుల్ డ్రెస్, చేతిలో సిగరెట్, రిక్షా పై కూర్చొని గంబీరంగా నటుడు నరేష్ కనబడుతున్నారు.

ఎప్పుడు అల్లరిగా, సరదాగా , సింపుల్ స్టయిల్ గా ఉండే నరేష్ ” బచ్చల మల్లి ” సినిమాలో గంభీరంగా కనబడబోతున్నారు. ఇటువంటి పాత్రలో నరేషను అభిమానులు చూడలేదు. ఈ సినిమాతో నరేష్ క్రేజ్ మరింత పెరుగుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 1980 లో జరిగిన ఒక కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలనే జాతర సెట్టింగ్ వేసి షూటింగ్ చేశారు. 1980 లో జరిగిన కథ కు తగిన విదంగా ప్రత్యేకంగా భారీ సెట్లు ఆకట్టుకునే విదంగా వేశారు. ఇప్పటికే సుమారుగా 80 శాతం సినిమా పూర్తి చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర నిర్మాత, దర్శకుడు షూటింగ్ సమయంలో ప్రకటించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *