Bharath X Pakistan : భారత్ , పాకిస్తాన్ రెండు జట్లు క్రికెట్ పోటీలో తలపడుతున్నాయంటే అభిమానులకు పెద్ద పండుగ. రెండు దేశాల అభిమానులతో పాటు ఇతర దేశాల క్రికెట్ అభిమానులు కూడా పోటీని చూడడానికి ఎన్ని పనులు ఉన్నా మైదానంకు తరలివస్తారు. ఇప్పుడు 2024 వరల్డ్ కప్ పోటీ. అదికూడా టీ 20 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ పోటీలు వెస్టన్ డీస్, అమెరికా ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి.
వరల్డ్ కప్ తొలి పోటీలలో ఇండియా, పాకిస్తాన్ తలపడనున్నాయి. జూన్ 9న న్యూయార్క్ లో ఆడనున్నాయి. ఆ పోటీలను చూడడానికి వచ్చే అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి టికెట్ ధర కూడా అప్పుడే నిర్ణయించేసింది. ఒక టికెట్ ధర 20 వేల డాలర్లు. అంటే సుమారుగా రూ : 16.65 లక్షలు . ఇంత ఖరీదు చెల్లించి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూడాలి. ప్రత్యక్షంగా అభిమాన క్రికెటర్ ఆడుతున్న అట చూడాలంటే అంత ఖరీదు చెల్లించి స్టేడియం వెళ్ళాలి. లేదంటే ఇంటిలో టీవీ కి పరిమితం కావాల్సిందేనని కొందరు అభిమానులు నిరుత్సహం వ్యక్తం చేస్తున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని ఐసీసీ ఆదాయం పెంచుకోడానికి సద్వినియోగం చేసుకుంటున్నదనే అభిప్రాయాలు సైతం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తం కావడం విశేషం.