Sinima Hall : తెలంగాణలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు సమ్మెలోకి దిగాయి. రెండువారాల పాటు సినిమా హాళ్ల ను మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నారు యజమానులు. అకస్మాత్తుగా సమ్మెలోకి వెళ్లడంతో సినిమా ప్రేక్షకులకు వేసవి సరదా ఇబ్బందిగా మారింది. సినిమా ప్రదర్శిస్తే కనీసం ఖర్చులు కూడా వెళ్లడంలేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ బిల్లు, సిబ్బంది వేతనాలు, పన్నులు, చెల్లించడానికి వచ్చే ఆదాయం సరిపోవడం లేదని వాపోతున్నారు. ఆదాయం తగ్గడంతో పలువురు సినిమాహాల్ ను ఫంక్షన్ హల్లు గ మార్చుకోవడం జరిగింది. మరి కొందరు ఏకంగా కూలగొట్టి , ఆదాయం ఉన్న వ్యాపార సంస్థలను ప్రారంభించారు. సినిమా హాల్ల స్థానంలో మరొక వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించిన వారు ప్రశాంతంగా ఉన్నారు.
సినిమా టికెట్ ధరలు పెంచే పరిస్థితి కూడా లేదు. యువత ఎక్కువగా మొబైల్ వాడుతోంది. సినిమాలను కూడా కుటుంబ సభ్యులకు ఉన్న మొబైల్ లోనే చూస్తున్నారు. దీనితో ఎక్కువ మంది సినిమా హాళ్లకు రావడం మానేశారు. టికెట్ ధరలు పెంచే పరిస్థితి లేదు. జనం వచ్చే అవకాశం కనబడటం లేదు. ఖర్చులు పెరిగి పోయాయి. నిర్మాతలు ఆదుకుంటేనే బాగుపడే పరిస్థితి ఉందని పలువురు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.