ప్రజా సమస్యలపై పోరాటమే బీజేపీ లక్ష్యం
బెల్లంపల్లిలో పట్టణ పదాధికారుల సమావేశం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి మాజీ ఎమ్మెల్యే, అమురాజుల శ్రీదేవి కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం బీజేపీ పట్టణ అధ్యక్షురాలు ధార కళ్యాణి ఆధ్వర్యంలో పట్టణ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు...