NIGAMA MEDIA (P) LTD
12.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 17, 2026

తెలంగాణ రక్షణ సేనలో చేరికలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: లింగంపల్లి నాగరాజు

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

తెలంగాణ రక్షణ సేనలోకి పలువురు చేరికలతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్ఎంపీ వైద్యుడు చిట్టంపల్లి నాగరాజు శుక్రవారం తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగంపల్లి నాగరాజు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తోందని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవడమే పార్టీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ తెలంగాణ రక్షణ సేన వేదికగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్ ముదిరాజ్, జిల్లా పార్టీ నాయకులు మ్యాకల తిరుపతి, శ్రీరాముల రమేష్, బసవేణి రాజేందర్, మడిపల్లి వినీత్, పల్లె శారద తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.