కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం మందమర్రి మండలంలో నోడల్ ఆఫీసర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖలకు చెందిన 24 క్షేత్రస్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 7 పిటిషన్లు స్వీకరించారు. ఇందులో 2 పిటిషన్లు మందమర్రి మున్సిపల్ కమిషనర్ పరిధికి, మరో 5 పిటిషన్లు మందమర్రి తహసీల్దార్ కార్యాలయ పరిధికి సంబంధించినవిగా అధికారులు తెలిపారు.
ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నోడల్ ఆఫీసర్ రాజేశ్వర్ సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});