కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గోబ్బరి సుధారాణి బాపురెడ్డి తన చేతుల మీదుగా గ్రామస్థులకు మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ మండల వెంకటేశం, గ్రామ సంఘం సీఏ రేణుక, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు పుట్ట నర్సింలు, గబ్మరపురం లింగం, పిడుగు చిన్నస్వామి, పాలకవర్గ సభ్యులు, డ్వాక్రా మహిళలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

