హరితహారంలో భాగంగా మొక్కల పంపిణీ
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గోబ్బరి సుధారాణి బాపురెడ్డి తన చేతుల మీదుగా గ్రామస్థులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణరెడ్డి, మాజీ...