NIGAMA MEDIA (P) LTD
23.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించిన కవిత

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సంస్థాగత బలోపేతంపై పార్టీ దృష్టి
మహిళ, విద్యార్థి, బీసీ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షుల నియామకం
19 అసెంబ్లీ – 9 లోక్‌సభ స్థానాలకు
టీఆర్ఎస్ ఇన్‌ఛార్జీల నియామకం

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 19 శాసనసభ మరియు 9 లోక్‌సభ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జీలను టిఆర్ఎస్ చీఫ్ కవిత ప్రకటించారు.

అదే సమయంలో పార్టీ అనుబంధ విభాగాలకు కూడా కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పడాల మనోజ గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జానపాటి రాము యాదవ్, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అల్లంపల్లి రామకోటిలను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయడం, ప్రజల్లో పార్టీని మరింత చేరువ చేయడం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు సమాచారం. కొత్తగా నియమితులైన నాయకులు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని, కార్యకర్తలతో సమన్వయం పెంచి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.