20.9 C
Munich
Sunday, July 26, 2026

Singareni : నాణ్యమైన బొగ్గు ఉత్పత్తితోనే సంస్థ అభివృద్ధి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Singareni : సింగరేణి బొగ్గుగనుల్లో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేసినప్పుడే సంస్థ అభివృద్ధి చెందుతుందని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా కాసిపేట – 1 గని మేనేజర్ డి. సతీష్ స్పష్టం చేశారు. గని ఉత్పత్తి, ఉత్పాదకత, ప్రమాదాలపై మేనేజర్ సతీష్ గని అధికారులు, సూపెర్వైజర్లు, కార్మిక సంఘాల ప్రతినిధిలతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన గని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ…..

సంస్థ ప్రగతి పథంలో పయనిస్తున్నదనడానికి ప్రధాన కారకులు కార్మికులేనని ఆయన స్పష్టం చేశారు. గని అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు సమిష్టిగా నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేసినప్పుడే వినియోగదారుడు ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయడానికి మట్టి, సేలు ను తొలగించుకోవాల్సిన అవసరం తప్పనిసరన్నారు. ప్రమాద రహిత ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం తప్పనిసరన్నారు.

అనంతరం బెల్లంపల్లి ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి ఎంత ముఖ్యమో నాణ్యత కూడా అంతే ప్రదానమని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని సకాలంలో సాధించడానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి నిఖిల్, అండర్ మేనేజర్ హిమాలయ, కార్మిక సంఘాల నాయకులు బన్న లక్ష్మన్ దాస్, రంజిత్, మురళి, సదయ్య, ఉద్యోగులు, సూపర్వైజర్లు, కార్మికులు పాల్గొన్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.