20.9 C
Munich
Sunday, July 26, 2026

Mavoist : అడవి దాటుతున్న కట్టు బాట్లు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Mavoist : మావోయిస్టు పార్టీలో దళ కమిటీ నుంచి మొదలుకొని కేంద్ర కమిటీ వరకు వారి పరిధిలోనే నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరి పరిధిలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సమిష్టిగానే ఉంటవి. ఏ ఒక్కరు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఉండదు. ఒకవేళ తీసుకుంటే అది పార్టీ కట్టుబాట్లకు వ్యతిరేకమే అవుతుంది. సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం కూడా అంత కఠినంగానే ఉంటుంది పార్టీలో. అంతర్గతంగా గతంలో ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి కి కొండపల్లి సీతారామయ్యకు మధ్య విభేదాలు వచ్చినప్పటికీ పార్టీకి సీతారామయ్య నష్టం చేపట్టలేదు. ఎంతో కట్టుదిట్టంగా కార్య కలాపాలను నిర్వహించే పార్టీ 1990 నుంచి తన కట్టుబాట్లు అడవి దాటుతున్నవనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

మావోయిస్టు పార్టీ ఎదో ఒక ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఇన్ ఫార్మర్ల హత్యలు, కిడ్నాప్ చేయడం, మందు పాతర్లు పేల్చడం సంఘటనలకు పాల్పడేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తట్టుకోలేక తల్లడిల్లిపోతోంది. బలగాల ఒత్తిడికి తట్టుకోలేక కొందరు ఎన్కౌంటర్ కు బలవుతున్నారు. మరి కొందరు లొంగిపోతున్నారు. ఇందులో ఎక్కువగా కేంద్ర కమిటీ కార్యదర్శి నుంచి మొదలుకొని కేంద్ర కమిటీ సభ్యులు కావడం విశేషం. ఈ వైఫల్యాలకు పార్టీలో వైఫల్యం, కోవర్టుల సహకారం, బలగాల సాధనలో కారణం ఏదయినా కావచ్చు. వెంట, వెంట వరుస దెబ్బలు మాత్రం పార్టీకి తగలడంతో ఆత్మపరిశీలనలో పడింది.

1990లో హుజురాబాద్ దళం వీణవంక మండలంలోని చేనులో ఉన్న దళ కమాండర్ భూపతి తో పాటు దళ సభ్యులపై డిప్యూటీ దళ కమాండర్ కత్తుల సమ్మయ్య కాల్పలు జరిపాడు. ఆ కాల్పుల్లో భూపతి తోపాటు మరో ముగ్గురు చనిపోయారు. తుపాకులతో కత్తుల సమ్మయ్య ప్రభుత్వానికి లొంగిపోయాడు. ఆ తరువాత కొద్ధి రోజు లకు కొలొంబో విమానాశ్రమంలో జరిగిన ప్రమాదంలో సమ్మయ్య చనిపోయాడు.

ఆ సంఘటన అనంతరం నల్లగొండ జిల్లా పావురాల గుట్టల్లో నిద్రిస్తున్న దళంపై అదే దళానికి చెందిన దళసభ్యుడు సోమ్లా నాయక్ కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో తొమ్మిది మంది దళ నేతతో సహా చని పోయారు. దళ సభ్యుల తుపాకులతో లొంగిపోయాడు. అతని అరాచకాలు సహించక అదే జిల్లాకు చెందిన గ్రామస్తులు సోమ్లా నాయక్ ను కొట్టి చంపారు.

ప్రస్తుత పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రామగిరి ఖిలా అడవుల్లో పార్టీ జిల్లా ప్లీనరీ ఏర్పాట్లు చేస్తోంది. అక్కడే ఏర్పాట్లు చేస్తున్న దళానికి సెంట్రీ విధులు నిర్వహిస్తున్నాడు దళ సభ్యుడు జడల నాగరాజు. సెంట్రీలో ఉన్న నాగరాజు కరీంనగర్ జిల్లా కార్యదర్శి విజయ్ ని ఖిలాపై కాల్చిచంపాడు. విజయ్ ఏకే-47 తో నాగరాజు పోలీసులకు లొంగిపోయాడు. ప్లినరీకి జిల్లాలోని దళాలు చేరుకుంటున్న సమయంలోనే ఈ సంఘటన జరగటం విశేషం. 14 ఏళ్ల నుంచి నాగరాజు కనబడుటలేదు. ఏమైనాడో ఇప్పటికి కూడా తెలియదు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు అడవుల్లో డిసెంబర్ 2, 1999 న జరిగిన ఎదురుకాల్పుల్లో కీలక నేతలు చనిపోయారు. ఈ సంఘటనలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, యర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, ఉత్తర తెలంగాణా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి శీలం నరేష్ మరణించారు. ఈ ఎన్కౌంటర్ బూటకమని పౌరహక్కుల సంఘాలు ఆరోపించాయి. డెన్ కీపర్ గోవిందరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగానే బెంగుళూర్ లో ముగ్గురు నేతలు దొరికిపోయారని పౌరహక్కుల నేతలు ఆరోపించారు.

తాజాగా పార్టీలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆయనను పార్టీ విప్లవ ద్రోహిగా ప్రకటించడం సంచలనం అయ్యింది. ఆయన చర్చల పేరిట విడుదల చేసిన లేఖలను గమనిస్తే పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తినట్టు స్పష్టమవుతోంది. చర్చల సారాంశం బయటకు రావాల్సింది కేంద్ర కమిటీ కార్యదర్శి హోదాలోనే రావాలి. ప్రధాన కార్యదర్శి తో సంబంధం లేకుండానే సోను సొంతంగా ప్రకటన విడుదల చేసాడంటేనే పార్టీ కట్టు బాట్లు అడవి దాటి పోతున్నాయనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం కావడం విశేషం.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.