23.9 C
Munich
Monday, July 27, 2026

Terrorism Traces : చిన్న పట్టణాలు….ఉగ్ర స్థావరాలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

1999లోనే కోల్ బెల్ట్ లో అజమ్ గౌరీ చిరువ్యాపారి గా అవతారం
2000 లో జగిత్యాలలో ఎన్కౌంటర్
తాజాగా మూడోసారి బోధన్ లో ఉగ్ర మూలాలు

Terrorism Traces : ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను విస్తరించడానికి సురక్షితమైన స్థావరాలుగా చిన్న, చిన్న పట్టణాలను ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ వంటి పెద్ద, పెద్ద పట్టణాలను విడిచి పెట్టి ఇప్పుడు చిన్న పట్టణాలను ఉగ్రవాదులు ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా బోధన్ లో మహ్మద్ యామాన్ అనే ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం ఇందుకు ఒక తార్కాణం.

పాకిస్తాన్ కు చెందిన ఒక ఉగ్రవాది 1999 లోనే కోల్ బెల్ట్ లో చిరు వ్యాపారి అవతారం ఎత్తి చివరకు జగిత్యాల జిల్లా కేంద్రములో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించాడు. గతంలో తెలంగాణలో ఉగ్రవాద కార్యకలాపాలు హైదరాబాద్‌ పాత్‌బస్తీ కేంద్రంగా జరిగేవి. కానీ ఇప్పుడు బోధన్, నర్సాపూర్, నల్గొండ, జగిత్యాల, బోధన్, కోల్ బెల్ట్ ప్రాంతాల్లో కనబడుతున్నవి.

పాకిస్తాన్ నుంచి వచ్చిన అజమ్ గౌరీ అనే ఉగ్రవాది మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్ లో మకాం పెట్టాడు. అక్కడే ఉంటూ చిల్లర వస్తువులు సైకిల్ పై అమ్ముతూ జీవనం సాగించాడు. అక్కడి నుంచి శ్రీరామ్ పూర్ లో ఒక సింగరేణి అధికారి ఇంటిలో దర్జీ అవతారం ఎత్తాడు. అక్కడ మహిళలకు దుస్తులు కుడుతూ నమ్మించాడు. ఆ అధికారి ల్యాండ్ ఫోన్ ను కూడా వాడు కున్నాడు. అక్కడి నుంచి నేరుగా మంచిర్యాల రైల్వే స్టేషన్ రోడ్ లో కొద్దీ రోజులు టైలర్ అవతారంతో కార్యక్రమాలు కొనసాగించాడు.

అక్కడి నుంచి నేరుగా జగిత్యాలకు తన మకాం మార్చాడు. చివరకు అతని మూలలను నిఘా అధికారులు కనిపెట్టారు. అక్కడే భాద్యతలు చేపట్టిన అప్పటి ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ అతని కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో అజమ్ గౌరీ జగిత్యాల పట్టణంలో పట్ట పగలు 6 ఏప్రిల్, 2000 న సైకిల్ పై వెళుతూ అతని సంచిలో నుంచి రైఫిల్ తీస్తున్న క్రమంలో గమనించిన ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ జనం మధ్యలోనే కాల్పులు జరపడంతో అజమ్ గౌరీ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వెంట ఉన్న సంచిని పరిశీలించగా మరో రైఫిల్ కనిపించింది.

2022లో బోధన్‌లోనే పాకిస్తాన్‌తో సంబంధమున్న 60 మందికి పాస్‌పోర్టులు అందజేసిన వ్యవహారం బట్టబయలయ్యింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడిన వ్యక్తి ద్వారా ఈ వ్యవహారం తెలిసింది. ఆ సంఘటన జరిగిన కొద్ది నెలలకే బోధన్ లో కరాటే మాస్టర్ అవతారం ఎత్తిన అబ్దుల్‌ ఖాదర్‌ ను నిఘా అధికారులు అరెస్ట్ చేయడం విశేషం. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) పేరుతొ అబ్దుల్ ఖాదర్ తన కార్యాలపాలను ఒకవైపు విస్తరిస్తూనే, మరోవైపు 200 మందికి కరాటేలో శిక్షణ ఇచ్చినట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి.

హిజ్బుత్ తహ్రీర్ (ఇస్లామిక్ రాడికల్స్) పేరుతొ శిక్షణ పొందిన 17 మంది ఉగ్రవాదుల్లో ఐదుగురిని హైదరాబాద్ లో, మధ్యప్రదేశ్ భూపాల్ లో 12 మందిని 10 మే, 2022 న మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ బృందం అరెస్ట్ చేసింది. వీరంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ, శామీర్ పేట లో శారీరక శిక్షణ, మోహిదీ పట్నంలో తుపాకీ శిక్షణ, వికారాబాద్ అనంతగిరి కొండల్లో బాంబులు పేల్చడంలో శిక్షణ పొందారు.

తాజాగా మరోసారి ఉగ్ర మూలాలు బోధన్‌ లో బయట పడటంతో స్థానిక నిఘా వర్గాలు సైతం విస్తుపోయాయి. బోధన్ లో తాజాగా అరెస్ట్ అయిన మహ్మద్‌ యమాన్‌ వయసు 20 ఏళ్ళు. ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసే వరకు కూడా అతనెవరు అనే విషయం ఆ కాలనీ వాసులతో పాటు ఇంటి యజమానికి సైతం తెలియదు. 2022 లో పాస్ పోర్ట్ వ్యవహారం, అదే ఏడాది కరాటే మాస్టర్ అవతారం ఎత్తిన అబ్దుల్ ఖాదిర్ అరెస్ట్, తాజాగా మహ్మద్ యమాన్ అరెస్ట్ అయ్యాడు. ఈ మూడు సంఘటనలు బోధన్ లోనే కావడం విశేషం. వాస్తవానికి ఒకసారి ఎదురుదెబ్బ తగిలితే మరో ప్రాంతాన్ని ఎంచుకుంటారు ఉగ్రవాదులు. కానీ వరుసగా బోధన్ పట్టణాన్నే ఎంపిక చేసుకుంటున్నారంటే స్థానికంగా వారికి పట్టు కొంత ఉన్నట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.