22 C
Munich
Monday, July 27, 2026

Jagruthi : ప్రత్యక్ష రాజకీయాల్లోకి జాగృతి నాయకులు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Jagruthi : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గులాబీ పార్టీని ఒక కుదుపు కుదిపేసింది. ఆమె చేసిన ప్రకంపనలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. తండ్రికి లేఖ రాసిన విషయం నుంచి మొదలు కొని జాగృతి కార్యాలయం ప్రారంభించే నాటికి కూడా ఆమె రోజు ఎదో ఒక ప్రకటన చేస్తూనే వచ్చింది. ఇంత జరుగుతున్నా కవిత పై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు లేవు. అయినప్పటికీ ఆమె దూకుడుగానే వ్యవహరిస్తోంది. కవిత తన రాజకీయ ప్రక్రియను మాత్రం బిన్నంగా చూపుతోంది.

కొద్ది రోజుల నుంచి కవిత రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. చేరికలు కూడా జరుగుతున్నాయి. జాగృతిని బలోపేతం చేయడంలో భాగంగానే శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువతను పార్టీలోకి చేర్చుకోవడమే కవిత ప్రధానంగా ఎంచుకొన్నట్టుగా తెలుస్తోంది. బిఆర్ఎస్ తో ఎలాంటి సంబంధం లేకుండానే ఒంటరిగానే జాగృతిని బలోపేతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు వెళ్లడంలేదు. కాళేశ్వరం కమిషన్ వద్దకు కేసీఆర్ వెళుతున్న సందర్భంలో కవిత కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అయినా కేసీఆర్ మాట్లాడలేదు. అయినప్పటికీ తన పార్టీ బిఆర్ఎస్ అంటోంది. అంతే కాదు తమ నాయకుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూంది.

బిఆర్ఎస్ లో లేఖ కు ముందు ఉన్నటువంటి ప్రాధాన్యత నేడు ఎక్కడ కూడా కనబడుటలేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమెను పిలవడం లేదు. ఆమెపై కేసీఆర్ కు అసంతృప్తి ఉంది. అయినా కవిత తన పని తాను చేసుకు పోతోంది. రాజకీయ శిక్షణ పొందిన వారితో రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటం చేయడానికే సన్నద్ధమవుతోంది. ఒకవేళ కవిత సొంతంగా రాజకీయ జెండా ఏదయినా పడితే కేసీఆర్ కూడా అప్పుడే ఆమె పై పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.