24.4 C
Munich
Sunday, July 26, 2026

Kavitha : వన్ ఉమెన్ ఆర్మీ @ ఎమ్మెల్సీ కవిత

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Kavitha : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీ కంటే ముందుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీతో ఆమె పోటీ పడుతున్నట్టుగానే కనిపిస్తున్నదనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ నిర్ణయం తీసుకునే లోపుననే ఆమె తన అనుచరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆ పరిస్థితుల్లో పార్టీ పెద్దలకు ఏమి చేయాలో అంతుపట్టడం లేదు. ఆమె చేస్తున్న నిరసన కార్యక్రమాలు పార్టీ కి మద్దతుగా ఉన్నప్పటికీ, చూసేవారికి మాత్రం పార్టీ వెనుకబడినట్టుగా కనిపిస్తోంది.

తాజాగా ప్రభుత్వం బస్ పాస్ ధరల్ని పెంచుతూ ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీ కవిత మాత్రం బస్ భవన్ ముందు తన అనుచరులతో వచ్చేసి ధర్నా చేపట్టింది. తెలంగాణ జాగృతి ఈ విషయంలో ఆందోళన కార్యక్రమాలు తప్పకుండ చేస్తుందంటూ హెచ్చరించింది. నేటికీ కూడా కవిత పాత రాజకీయాలనే నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. ఉద్యమం డైలాగులనే నేటికీ వల్లెవేస్తుంది.

రాబోయే బోనాల పండుగకు బోనాలపై జై తెలంగాణ రాయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటున్నారు. ఫోన్ లో మాట్లాడేటప్పుడు ముందుగా జై తెలంగాణ అనాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. అప్పుడంటే ఉద్యమం. ఇప్పుడెందుకు అలా ఫోన్లో మాట్లాడాలి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రము ప్రత్యేకంగానే ఉంది. అటువంటప్పుడు అస్తిత్వం అనే పదాలు ఆమె ఎందుకు ముందుకు తీసుకువస్తున్నారు అంటూ రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కాలం మారింది. కానీ కవిత నేటికీ పాత తరం రాజకీయాలతోనే పార్టీ కంటే ముందు నడుస్తున్నారంటూ అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.