Kavitha : వన్ ఉమెన్ ఆర్మీ @ ఎమ్మెల్సీ కవిత

Kavitha : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీ కంటే ముందుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీతో ఆమె పోటీ పడుతున్నట్టుగానే కనిపిస్తున్నదనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ నిర్ణయం తీసుకునే లోపుననే ఆమె తన అనుచరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆ పరిస్థితుల్లో పార్టీ పెద్దలకు ఏమి చేయాలో అంతుపట్టడం లేదు. ఆమె చేస్తున్న నిరసన కార్యక్రమాలు పార్టీ కి మద్దతుగా ఉన్నప్పటికీ,...