19.9 C
Munich
Sunday, July 26, 2026

Singareni : ఆ స్టేడియం అంటేనే బయపడుతున్న కార్మికులు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Singareni : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని శాంతి స్టేడియంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా మాట్లాడుతూ కృష్ణ కాలనీలోని శాంతి స్టేడియంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రహరీ లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగడంవలన అసౌకర్యంగా మారిందన్నారు.

స్టేడియంలో విద్యుత్ దీపాలు లేవని, పలుచోట్ల గుంతలు ఉండటం వలన వర్షపు నీరు నిలవడంతో క్రీడాకారులకు ఇబ్బందిగా ఉందన్నారు. కార్మికులకు, వారి కుటుంబాలకు స్టేడియం అందుబాటులో ఉండే విదంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్బంగా జీఎం శ్రీనివాస్ ను కోరారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, కోశాధికారి నాగభూషణం, జిఎం కమిటీ చర్చల ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి, బద్రి బుచ్చయ్య, సంపత్, గొల్లపల్లి రామచందర్, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, ఫిట్ కార్యదర్శిలు ఆకుల లక్ష్మణ్, గునిగంటి నర్సింగారావు, మోతే లచ్చన్న, నవీన్ రెడ్డి, సందీప్, సంఘం సదానందం, అగ్గు శ్రీకాంత్, పెద్దయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.