24.4 C
Munich
Sunday, July 26, 2026

ugadi : ఉగాది తరువాత ఈ మూడు రాసుల వారికి అన్నీ విజయాలే

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ugadi : నూతన తెలుగు సంవత్సరం రాబోతోంది. అంటే ఉగాది పండుగతో మొదలవుతుంది. అంటే హిందూ కుటుంబాలు 2025-నూతన తెలుగు సంవత్సరానికి స్వాగతం చెప్పనున్నారు. తొలి పండుగ రోజు చాల మంది పంచాంగ శ్రవణం వింటారు. రాబోయే ఏడాది కాలం పాటు తమ అదృష్టం ఎలా ఉందొ తెలుసుకోడానికి ఉగాది రోజు వేదపండితుల వద్దకు వెళుతారు. ఉగాది పండుగ తరువాత నుంచి ఆ మూడు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అంటే కుటుంబానికి అన్ని విజయాలే రానున్నాయని వేదం పండితులు చెబుతున్నారు. ఆ మూడు రాసుల గురించి వేద పండితులు ఈ విదంగా చెబుతున్నారు.

కన్యారాశి : ఈ రాశివారికి శనీశ్వరుడి వలన మంచి ఫలితాలు రానున్నాయి. శని దేవుడు కన్య రాశి 7వ ఇంట్లో ఉదయిస్తాడు. కాబట్టి కన్య రాశి వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అసంపూర్తి పనులు పూర్తి అయ్యే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన యోగం ఉంది. సమాజంలోపేరు, ప్రతిష్టలు పెరుగనున్నాయి.

కర్కాటక రాశి : శనీశ్వరుడు కర్కాటక రాశి 9వ ఇంట్లో ఉదయిస్తాడు. ఈ రాశివారికి శనీశ్వరుడి అనుగ్రహం ఉంది. గతంలో కంటే ఎక్కువగా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. పూర్వీకుల ఆస్తిని పొందేఅవకాశం ఉంది. వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది.

ధనుస్సు రాశి : శని దేవుడు ఈ రాశి వారికి నాల్గవ ఇంట్లో ఉదయిస్తాడు.శనీశ్వరుడి సంచారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేస్తున్న పనిలో విజయం సాధిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. విడిపోయిన కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉంది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.