23.9 C
Munich
Monday, July 27, 2026

Rohit sharma : ఆ క్రికెటర్ దిగ్గజం పై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన రోహిత్ శర్మ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Rohit sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా పర్యటన కలిసిరాలేదు. ఈ పర్యటనలో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. ఇటీవల అతని నాయకత్వాన్ని సైతం ప్రశ్నించడం జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటన కూడా ఒక పీడకలలా మారింది.

ఇదే సమయంలో ఓ టీం ఇండియా దిగ్గజం కూడా రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ విమర్శలతో తీవ్ర మనస్తాపానికి గురైన రోహిత్ శర్మ నేరుగా బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని సమాచారం. ఈ ఫిర్యాదు కాస్త క్రికెట్ అభిమానుల్లో దుమారం లేపింది. ఆస్ట్రేలియా తో ఆడుతున్న సమయంలో ఆ క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ పై అనవసరమైన మాటలు వదిలిపెట్టినట్టు సమాచారం.

ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన అనంతరం బీసీసీఐ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోహిత్ శర్మ పలు అంశాలపై మాట్లాడారు. అదే సందర్భంలో సునీల్ గవాస్కర్ అనవసరంగా తనపై నోరు పారేసు కున్నాడని రోహిత్ శర్మ ఫిర్యాదు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటన గురించి గవాస్కర్ ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా రోహిత్ శర్మ ఆ సమావేశంలో మాట్లాడినట్టుగా తెలిసింది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.