22.1 C
Munich
Tuesday, July 28, 2026

Go to Delhi : ఢిల్లీ కి 20 మంది ఎమ్మెల్యేలు…. పార్టీలో ఎం జరుగుతోంది ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Go to Delhi : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మలుపు తిరుగుతున్నాయి. చంద్రబాబునాయుడు పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తా అంటున్నారు. ఎమ్మెల్సీ కవిత జైలు లో ఉండటం కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. హైడ్రా చేపట్టిన చర్యలతో సీఎం రేవంత్ రెడ్డి కి ప్రజల్లో ఆధరణ పెరుగుతోంది. రుణ మాఫీ విషయం కూడా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండానే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పరిణామాలు మాత్రం బిఆర్ఎస్ నేతలకు రుచించడంలేదు. సీఎం రేవంత్ రెడ్డి దూకుడును తట్టుకోలేకపోతోంది బిఆర్ఎస్. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ పయనమవుతున్నారు. ఢిల్లీ బాట పట్టడానికి వివిధ కారణాలు వ్యక్తం అవుతున్నాయి రాజకీయ వర్గాల్లో .

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కోర్ట్ లో మంగళ వారం విచారణ జరుగనుంది. ఇప్పటికే కొందరు సీనియర్ నాయకులు ఢిల్ల్లీలోనే మకాం వేశారు. బెయిల్ పరిస్థితులను కూడా గమనిస్తున్నారు. సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ మంగళవారం బెయిల్ మంజూరు అయితే ఎమ్మెల్యేలతో కలిసి ఘనంగారాష్ట్రానికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఒకవేళ బెయిల్ రాని నేపథ్యంలో ఈడీ , సీబీఐ కార్యాలయాల ఎదుట ధర్నా చేయడానికి కూడా సిద్ధమైనట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

ఇది ఇలా ఉండగా దింతో పాటు మరో ప్రచారం కూడా జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ హామీ ఇచ్చింది రాహుల్ గాంధీ. ఈ హామీ విఫలమైనదని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఇంటి ఎదుట ధర్నా చేయడానికే 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి ఢిల్లీ వెళుతున్నట్తుగా ప్రచారం పార్టీలో జరుగుతున్నది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ బెయిల్ రాని నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇంటి ఎదుటనే నిరసన కార్యక్రమం ఉంటుందని బిఆర్ఎస్ వర్గాల సమాచారం.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.