NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Telangana Politics : తెలంగాణలో విగ్రహాల వార్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Telangana Politics : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ తెలంగాణలో పొలిటికల్ వార్ ముసురుకొంది. అధికార పార్టీ కాంగ్రెస్ తో గులాబీ శ్రేణులు నువ్వు ఎంత అంటే, నువ్వు ఎంత అంటూ కాలు దువ్వుతున్నారు. కామెంట్లు, కౌంటర్లు, సవాళ్లు, ఛాలంజ్ అంటే ఛాలంజ్ అంటూ హద్దులు దాటి పోతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను కూడా వాడుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో భావావేశాలకు తావిస్తున్నారు ఇరువర్గాల నాయకులు.

దివంగత నేతల విగ్రహాల కోసం నిగ్రహం కోల్పోయి జగడం పెట్టుకోవడం మన నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు రాష్ట్రంలో సరికొత్త రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని అధికార పార్టీ ప్రకటించింది. అవకాశం దొరికిందని గులాబీ శ్రేణులు కాలుదువ్వేస్తున్నారు. తెలంగాణకు రాజీవ్ గాంధీ ఏం చేసాడు. అయన ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారా ? అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీ ఏమవుతాడు అంటూ బిఆర్ఎస్ శ్రేణులు నిలదీస్తున్నారు.

రాజీవ్ గాంధీ గురించి అడగటానికి ఇంతకు నువ్వెవరు. చెప్పు తెగుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఘాటు పదాలు పొలిటికల్ తుఫాన్ గా మారాయి. సోమాజీ గూడలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు ప్రస్తావన తీసుకొచ్చారు. అంతకంటే ముందే బిఆర్ఎస్ విగ్రహం ఏర్పాటుపై ఊగిపోతోంది. తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటూ కేటీఆర్ కూడా మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వంతో ఆటలాడుకుంటే ఊరుకునేది లేదంటూ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టుగా మాట్లాడారు.

కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ఘాటుగానే స్పందించారు. సచివాలయంలో కేసీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి వెర్బల్ ఎటాక్ చేసి తనదయిన శైలిలో బిఆర్ఎస్ శ్రేణులకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కు కేటీఆర్ కు పొలిటికల్ వార్ వేడెక్కింది.

కోట్లాది రూపాయలు దోచుకొని వందలాది ఎకరాలు కొన్నారు. అటువంటి వాళ్లంతా కూడా నేడు ఫామ్ హౌజ్ లు నిర్మించుకున్నారు. అటువంటి వాల్ల విగ్రహాల కంటే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం మెలనేది కాంగ్రెస్ వాదన.
ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తాము అధికారంలోకి వచ్చిన నాడే తొలగిస్తామని కేటీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది. సెంటిమెంట్ పెరిగిపోతున్నదని భావించింది కాంగ్రెస్ పార్టీ. బిఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలని ఎత్తు వేసింది.
సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముహూర్తం కూడా ఖరారు చేశారు.

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాకితే ఊరుకునేది లేదని ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. గడిచిన పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచన లేనివాళ్లకు ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఏదిఏమైనప్పటికీ తెలంగాణలో మాత్రం విగ్రహాల చుట్టూ రాజకీయం నడుస్తోంది. రాష్ట్రంలో ప్రధాన సమస్యలు గాలికొదిలేసి విగ్రహాల కోసం వెంపర్లాడటం రాజకీయ నాయకులకే చెల్లుతుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.