17.5 C
Munich
Tuesday, July 28, 2026

MLC Kavitha : బిఆర్ఎస్ కు ప్రధాన సమస్య …. కవిత బెయిల్ ….

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

MLC Kavitha : తెలంగాణ ఉద్యమ నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాన సమస్య ఒకటే. తన కూతురు కవితకు బెయిల్ తీసుకు రావడం. అప్పటి వరకు ఎన్ని సమస్యలు ఎదురైనా పట్టించుకునే పరిస్థితి కనబడుత లేదంటున్నారు గులాబీ శ్రేణులు. కాకలు తీరిన రాజకీయ నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడనే పేరు ఉంది. అటువంటి నాయకుడి కూతురు జైలు లో ఉంటె కేసీఆర్ పరిస్థితి రాజకీయ వర్గాల్లో ఎలా ఉంటదో చెప్పాల్సిన అవసరం లేదు.

ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లి నెలలు గడుస్తున్నాయి. ఆమెపై నమోదయిన కేసులోనే ఢిల్లీ సీఎం క్రేజీవాల్, డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా లకు ఇప్పటి వరకు కూడా బెయిల్ రాలేదు. ఈ నేపథ్యంలోనే కవితకు కూడా బెయిల్ వస్తుందనే నమ్మకం కనబడుత లేదని బిఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికి బెయిల్ తీసుకురావడానికి కేటీఆర్, హరీష్ రావ్ లు ఢిల్లీలో తమదయిన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ సలహాలతోనే వారిద్దరూ ఢిల్లీలో న్యాయవాదులను నిరంతరం సంప్రదిస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు కవితను హరీష్ రావ్, కేటీఆర్ లలో ఎవరో ఒకరు మాత్రమే కలిసేవారు. సీనియర్ న్యాయవాదులు ఉన్నప్పటికి కేసు అంత త్వరగా ఒక కొలిక్కిరాదనే విషయం తెలిసిందే. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు అంటూ ఏమీలేవు. అందుకనే హరీష్ రావ్, కేటీఆర్ లు ఇద్దరు కూడా కవిత బెయిల్ విషయమే ప్రధానంగా తీసుకున్నారు. తీవ్రఆవేదనలో ఉన్న కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు కవిత ను పరామర్శించడానికి మాత్రం వెళ్ళలేదు. ఒకవైపు కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు బీజేపీ ఢిల్లీ పెద్దలతో తెరవెనుక మంతనాలు కూడా జరుపుతున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసారంటే కేసు చాల బలంగా ఉంటుంది.

రాష్ట్రంలో అధికారం లేదు. పార్లమెంటులో బలం లేదు. అటువంటప్పుడు బీజేపీ తో వైరం అవసరమా ? మరో నాలుగేళ్ల అనంతరమే ఎన్నికలు. అప్పటివరకు రాజకీయంగా ఎవరి పరిస్థితి ఎలా ఉంటదో చెప్పే పరిస్థితి కూడా ప్రస్తుతం కనబడుటలేదు. బలంలేని సమయంలో కోరి వైరం తెచ్చుకోవడం అవసరమా అంటూ గులాబీ శ్రేణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైరంకు వెళ్లడంకు బదులు సంధి మార్గమే ఎంచుకోవడం ముఖ్యమని కొందరు గులాబీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టి పంతానికి పోవడం వదిలిపెట్టి కవితను బయటకు తీసుకువచ్చే దారికోసం ప్రయత్నించడం పార్టీకి చాలా ముఖ్యమనే విషయం ఇప్పుడు బిఆర్ఎస్ నాయకుల్లో చర్చనీయాంశం అయ్యింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.